Covid -19: కరోనా వైరస్ మన చుట్టూ ఏయే వస్తువులపై బతికుంటుందో తెలుసా? షాకింగ్‌ విషయాలు వెల్లడి..

కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ ఎంతకాలం ఉంటుంది? శరీరం వెలుపల ఎలా జీవిస్తాయి? వైరస్ ఎక్కడ ఎక్కువ కాలం జీవించగలుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానమిదే..

Covid -19: కరోనా వైరస్ మన చుట్టూ ఏయే వస్తువులపై బతికుంటుందో తెలుసా? షాకింగ్‌ విషయాలు వెల్లడి..
Corona Virus
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 08, 2022 | 8:58 PM

How long can a virus live around a human being: ప్రపంచ వ్యాప్తంగా కరోనా (coronavirus) సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఈ వైరస్‌ కారణంగా కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి విధ్వంసం తర్వాత కూడా జనాల్లో భయం, బెదురు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, లాంబ్డా, ఒమిక్రాన్‌తో సహా దాని అనేక వేరియంట్లు బయల్పడ్డాయి. ఈ వైరస్ ఒక చోట ఆగకుండా అనేక ఉత్పరివర్తనలు పోతోంది. ఫలితంగా సంక్రమణ ప్రమాదం, ప్రాణ హాని రెండూ పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ ఎంతకాలం ఉంటుంది? అనే పెద్ద సందేహం ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. ఇక వైరస్‌లు శరీరం వెలుపల ఎలా జీవిస్తాయి? వైరస్ ఎక్కడ ఎక్కువ కాలం జీవించగలుగుతుంది? అనే ప్రశ్నలకు మాయో క్లినిక్ (MayoClinic) నివేదిక కూలంకషంగా వివరిస్తోంది. మాయో క్లినిక్ అధ్యయన నివేదిక ప్రకారం.. జలుబు, ఫ్లూ వంటి ఇతర రకాల వైరస్లు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు మానవ శరీరంలో జీవిస్తాయి. కాబట్టి వీటి వల్ల సంక్రమణ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. వైరస్‌తో కూడిన ఇన్‌ఫెక్షన్లన్నీ ఈ విధమైన లక్షణం కలిగి ఉంటాయి. వ్యాధి సోకిన రోగి నోటి లాలాజలం చుక్కలు పడటం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుందని నివేదిక తెల్పుతోంది.

ఉదాహరణకు.. రోగి నోటి లాలాజలం చుక్కలు ఉక్కు, ప్లాస్టిక్ లేదా ఇతర వస్తువులపై పడితే, వైరస్ చాలా కాలం పాటు దానిపై బతికే ఉంటుంది. అందువల్ల వాటితో తయారు చేసిన వస్తువులను తాకడం వెంటనే మానుకోవాలి. స్టీలు, ప్లాస్టిక్‌తో పోలిస్తే బట్టలు, మెత్తని వస్తువులపై వైరస్ తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం కరోనావైరస్ స్టీల్, ప్లాస్టిక్‌పై కనీసం3 రోజులులపాటు ఉంటుంది.

తడి ప్రదేశాలతో జాగ్రత్త! తేమగా ఉన్న ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుంది. సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం.. వైరస్ ఒక ప్రదేశంలో ఎంతకాలం ఉంటుంది అనేది ఆ ప్రదేశంలోని ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నీటి ప్రభావం లేని ప్రదేశాలలో ఇది చాలా కాలం పాటు ఉంటుంది. అంటే ఉక్కు, ప్లాస్టిక్ వంటివి అన్నమాట.

వైరస్ ఒక వస్తువుపై ఎంతకాలం బతికుంటుంది? వైరస్‌లు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఒకేచోట బతికి ఉండటానికి అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. ఇది ఏ రకమైన వస్తువుపై ఉందనే దానిపై బతికి ఉండే కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు. తక్కువ లేదా ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో ఉన్న వైరస్‌లు 24 గంటల వరకు ఇన్ఫెక్షన్ ప్రమాదం కలిగిస్తాయి. ఈ సూచనల ద్వారా మిమ్మల్ని మీరు కరోనా నుంచి రక్షించుకోండి. ముఖ్యంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు అన్‌లాక్‌ చేశాయి. కాబట్టి పలు పాఠశాలలు, ఆసుపత్రులు, రద్దీగా ఉండే ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేస్తూ ఉండడం వల్ల వైరస్‌ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఖచ్చితంగా మాస్క్ ధరించడం మాత్రం మర్చిపోకండే!

Also Read:

HAL Recruitment 2022: ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకు అలర్ట్! హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌లో 85 ఉద్యోగావకాశాలు