కాఫీ, సిగరేట్ తాగవద్దు: మీకు సాయంత్రం లేదా రాత్రిపూట కాఫీ తాగే అలవాటు ఉంటే.. ఈ రోజు నుంచే మానేయండి. కాఫీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్నవారు నిద్రించడానికి ఇబ్బందులు పడుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు రాత్రి పడుకునే ముందు సిగరేట్ తాగడం కూడా మానేయాలి.