TS Group 4: త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌, ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు: మంత్రి హరీష్‌ రావు

TS Group 4: వరుసగా ఉద్యోగాల భర్తీ చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గ్రూప్‌ 4 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తాజాగా నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో..

TS Group 4: త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌, ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు: మంత్రి హరీష్‌ రావు
Harish Rao
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 06, 2022 | 5:16 PM

TS Group 4: వరుసగా ఉద్యోగాల భర్తీ చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గ్రూప్‌ 4 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తాజాగా నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో సిద్ధిపేట జిల్లా పొన్నాలో సమావేశమైన మంత్రి ఈ విషయాన్ని తెలిపారు. గ్రూప్‌ 4కి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్లు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారి కోసం డీఎస్సీ లాంగ్‌ టర్మ్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం టెట్‌ ఉత్తీర్ణత శాతం 32 ఉంటే.. కేసీఆర్‌ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 82 శాతం మంది ఉండడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఉచిత కోచింగ్‌ సదవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు.

కేంద్రంపై హరీష్‌ అటాక్‌.. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. కేంద్రంలో 16.50 లక్షల ఖాళీలు ఉన్నా వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో లక్ష 50 వేల ఖాళీలు ఉంటే.. ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి వివరించారు. కేంద్రం యువతను మోసం చేసేందుకే అగ్నిపథం పథకం తీసుకొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. ఉచితంగా కోచింగ్‌ సెంటర్లను నిర్వహిస్తుంటే, కేంద్రం మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత నోట్లో మట్టి కొడుతున్నారు అంటూ హరీష్‌ రావు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..