L And T Recruitment: డిప్లొమా విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఎల్‌ అండ్‌ టీలో ఉద్యోగం పొందే అవకాశం.

ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ డిప్లొమా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

L And T Recruitment: డిప్లొమా విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఎల్‌ అండ్‌ టీలో ఉద్యోగం పొందే అవకాశం.
L And T Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 31, 2023 | 12:38 PM

ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ డిప్లొమా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఆటోమొబైల్, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌/ సేఫ్టీ, కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌, కెమికల్‌, మెటలర్జీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు.

* అభ్యర్థులు 1-7-2001 నుంచి 30-6-2005 మధ్య జన్మించాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.

* డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 05-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..