AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthiki Vasthunnam Collections: బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేస్తోన్న వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్ మాస్ రాంపేజ్ కొనసాగుతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే.

Sankranthiki Vasthunnam Collections: బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేస్తోన్న వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
Sankranthiki Vastunnam
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2025 | 11:57 AM

Share

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‏కు ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్నా, పెద్దా అందరూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఒకప్పటి వెంకీ స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూపించారు అనిల్ రావిపూడి. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ అడియన్స్ జై కొడుతున్నారు. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండు రోజుల్లోనూ మరిన్ని కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బాక్సాఫీస్ వద్ద విక్టరీ రాంపేజ్ కొనసాగుతున్నట్లు పేర్కొంది. కానీ మొదటి రోజు ఈ సినిమా రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?