DMHO Kurnool: కర్నూలు డీఎంహెచ్‌ఓలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
DMHO Kurnool Recruitment: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు స్పెషలైజేషన్స్‌లో ఉన్న...
DMHO Kurnool Recruitment: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు స్పెషలైజేషన్స్‌లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు…
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 72 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, స్కిన్, ఆర్థోపపెడిక్స్, జనరల్ సర్జరీ వంటి స్పెషలైజేషన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు వాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డీఎంహెచ్ఓ, కర్నూలు జిల్లా, ఏపీ అడ్రస్‌కు అందించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,10,000 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-06-2022న మొదలై చివరి తేదీగా 10-06-2022ని నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…