AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ విద్యా వ్యవస్థను శాసిస్తున్న కేరళ సినిమా.. బ్యాంక్‌ బెంచర్స్ ఇక కనుమరుగేనా?

విలువలు కలిగిన సినిమాలు సమాజంలో సులభంగా మార్పును సృష్టించగలవు. ఈ విధమైన సినిమాలు ప్రజల్లో వినూత్న ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ మువీ దాదాపు 24 ఏళ్ల క్రితం విడుదలైంది. కానీ నేటికీ ఈ మువీలో చూపిన ఆదర్శ భావాలు ఏ మాత్రం చెక్కుచెదరకుండా సమాజానికి అందిస్తుంది. అదే 'కందియన్ శ్రీకుట్టన్' అనే మలయాళం సినిమా. ఈ మువీ సమాజానికి హితం చేకూర్చే ఆదర్శ విలువలు కలిగిన చిత్రాల జాబితాలోకి చేరుకుంది. వినేష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిన్న మువీ ఏకంగా కేరళ రాష్ట్ర విద్యా రంగంలో భారీ విప్లవాన్ని సృష్టించింది.

దేశ విద్యా వ్యవస్థను శాసిస్తున్న కేరళ సినిమా.. బ్యాంక్‌ బెంచర్స్ ఇక కనుమరుగేనా?
New Classroom Seating Model In Kerala
Srilakshmi C
|

Updated on: Jul 12, 2025 | 1:43 PM

Share

కోలీవుడ్ దర్శకుడు వినేష్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘కందియన్ శ్రీకుట్టన్’ అనే మలయాళం సినిమా ఏకంగా కేరళ రాష్ట్ర విద్యా రంగంలో భారీ విప్లవాన్ని సృష్టించింది. ఈ సినిమా కథ ఏంటంటే.. కొన్ని పాఠశాలలు తరగతి గదిలో ఫ్రంట్ బెంచర్స్, బ్యాక్ బెంచర్స్ వివక్షతను అంతం చేయాలని నిర్ణయించుకుంటాయి. బ్యాక్ బెంచ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడానికి తరగతి గదిలో విద్యార్థులపే వృత్తాకారంలో కూర్చునేలా సీటింగ్ అమరిక చేస్తారు. ఇలా చేయడం వల్ల తరగతిలో ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ సమానంగా చూడడం సాధ్యమవుతుందని భావిస్తారు. ఆ మేరకు పాఠశాలలో బ్యాక్ బెంచర్స్ అనే వాళ్లే లేకుండా సీటింగ్‌ అరేంజ్‌ మెంట్స్ చేస్తారు. ‘కందియన్ శ్రీకుట్టన్’ మువీలోని ఈ థీమ్‌.. ప్రస్తుతం కేరళ విద్యావ్యవస్థను ఆలోచనలో పడేసింది.

కొట్టాయం పరిప్ హై స్కూల్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా ప్రభావంతో.. కేరళలోని వడక్కన్చేరి తూర్పు మాంగాడ్ మోడల్ స్కూల్, వాలకం రామవిలాసం ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్ వంటి విద్యా సంస్థలలో తరగతిలో ఈ విధంగా విద్యార్ధులకు ‘U’ షేప్‌లో కూర్చోపెడుతున్నారు. ఇలా ఆ రాష్ట్రంలో దాదాపు ఆరు పాఠశాలలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఈ సంస్కరణ విస్తృతంగా అమలుకు నోచుకోనప్పటికీ ‘స్థానార్థి శ్రీకుట్టన్’ మువీతో ఈ మార్పు ప్రారంభమైంది. మరో విశేషం ఏమంటే.. ఈ మార్పు కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. పంజాబ్‌లో కూడా ఈ సంస్కరణ గురించిన ప్రచారం జరుగుతోంది. ఈ మువీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపిందని ‘కందియన్ శ్రీకుట్టన్’ దర్శకుడు, మువీ టీం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

‘స్థానార్థి శ్రీకుట్టన్’ సమాజంలో సృష్టించిన ఈ విప్లవాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. పాఠశాలల్లో వివక్షను అంతం చేయడానికి ఇది సహాయపడుతుందని చాలామంది అంటున్నారు. అయితే దీనిపై కొంత వ్యతిరేకత కూడా లేకపోలేదు. దీని ఆచరణాత్మకతపై సందేహాలు తలెత్తుతున్నారు. తక్కువ మంది పిల్లలు ఉన్న తరగతి గదుల్లో దీనిని అమలు చేయవచ్చని, అదే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆచరణాత్మకం కాదని పెదవి విరుస్తున్నారు. అయితే మరికొందరేమో..ముందు వరుసలో విద్యావేత్తలు ఉంటే, వెనుక బెంచ్‌లలో ‘స్వేచ్ఛా ఆలోచనాపరులు’ ఉంటారని అంటున్నారు. విద్యా సంప్రదాయాలకు మించి ఆలోచించే వారే వెనుక బెంచీల్లో ఉంటారని.. సమాజంలో మార్పులను సృష్టించేది బ్యాక్ బెంచర్లు మాత్రమే అని కొందరు లబోదిబోమంటున్నారు. అసలు బ్యాంక్‌ బెంచర్లు లేకుంటే ఈ సమాజం ఏమైపోతుందంటూ తెగ బాధపడిపోతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.