AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Delhi Online Couse: ఐఐటీ ఢిల్లీలో ఆన్‌లైన్ హెల్త్‌కేర్‌లో AI ఎగ్జిక్యూటివ్‌ కోర్సు.. వ్యవధి కేవలం 6 నెలలే!

హెల్త్‌కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే సమగ్ర ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది ప్రారంభంకానుంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. కోర్సు వ్యవధి, ఫీజు, చివరి తేది వంటి వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

IIT Delhi Online Couse: ఐఐటీ ఢిల్లీలో ఆన్‌లైన్ హెల్త్‌కేర్‌లో AI ఎగ్జిక్యూటివ్‌ కోర్సు.. వ్యవధి కేవలం 6 నెలలే!
online executive programme in IIT Delhi
Srilakshmi C
|

Updated on: Jul 12, 2025 | 10:07 AM

Share

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ.. TeamLease EdTechతో భాగస్వామ్యంతో విభిన్న డొమైన్‌లలో నిపుణుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ హెల్త్‌కేర్‌లో సమగ్ర ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది ప్రారంభంకానుంది. వైద్యులు, ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, మెడ్-టెక్ వ్యవస్థాపకులు వంటి నిపుణులకు పరిశ్రమ సంబంధిత AI నైపుణ్యాలను అందించడం ద్వారా హెల్త్‌ కేర్, సాంకేతికత మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రస్తుతం స్వీకరించింది. జూలై 31, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి కలిగినవ IIT ఢిల్లీ CEP పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. eVIDYA ప్లాట్‌ఫామ్‌లో భాగంగా ఐఐటీ ఢిల్లీ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (CEP) కింద ఈ కోర్సును తీసుకువచ్చింది. క్లినికల్ డేటాసెట్‌లను ఉపయోగించి సైద్ధాంతిక బోధన, ఆచరణాత్మక అనుభవాల మిశ్రమం ద్వారా అనువర్తిత అభ్యాసాన్ని పెంపొందించడము దీని ప్రధాన లక్ష్యం.

ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ వివరాలు..

ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. తరగతులు ఆన్‌లైన్‌లో వారాంతాల్లో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్ ఫీజు రూ.1,20,000 తోపాటు 18% GST చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ కోర్సు ఎవరు చదవొచ్చు..?

  • ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ ఆరోగ్య సంరక్షణలో హెల్త్‌, టెక్నాలజీ సమన్వయంతో పనిచేయాలని కోరుకునే విస్తృత శ్రేణి నిపుణుల కోసం రూపొందించారు.
  • హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌, క్లినిషియన్‌ లేదా ఎలాంటి కోడింగ్ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పూర్వ నేపథ్యం లేనివారు కూడా అభ్యసించవచ్చు. AI అనువర్తనాలను మెడిసిన్‌లో అన్వేషించడానికి ఆసక్తి ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్య-
  • సాంకేతిక ఆవిష్కరణలు, బయోమెడికల్ కంప్యూటింగ్‌లో ఇంజనీర్, డేటా అనలిస్ట్, అకడమిక్‌ రీసెర్చర్లు కూడా పాల్గొనవచ్చు.
  • వ్యాపారం లేదా ఉత్పత్తులలో AI-ఆధారిత పరిష్కారాలను చేర్చాలని చూస్తున్న మెడ్-టెక్ వ్యవస్థాపకులు, ఆరోగ్య సంరక్షణ స్టార్టప్ వ్యవస్థాపకులు సైతం అభ్యసించవచ్చు.

పాఠ్యాంశాల అవలోకనం

  • AI, మెషిన్ లెర్నింగ్ (ML), డీప్ లెర్నింగ్ (DL) భావనల పరిచయం.
  • వ్యాధి ఫలితాలను అంచనా వేయడానికి, క్లినికల్ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి AI ఉపయోగించడంలో శిక్షణ.
  • జనాభా ఆరోగ్య నిర్వహణ, ఎపిడెమియాలజీలో AI ఉపయోగించడం.
  • హాస్పిటల్ ఆటోమేషన్ కోసం FHIR, DICOM వంటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డేటా ప్రమాణాలతో AI అప్లికేషన్ పరిచయం.
  • ఆసుపత్రులు, క్లినిక్‌లలో AI అప్లికేషన్లను ప్రదర్శించే 10కి పైగా వివరణాత్మక కేస్ స్టడీలు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిjక్ చేయండి.