Kadapa Army Recruitment Rally: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ! నేరుగా వెళ్లొచ్చు

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అద్భుతం అవకాశం వచ్చింది. నేటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరనుంది. అసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా కడపలోని రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్న స్టేడియంకి వెళ్లవచ్చు. అక్కడే రిజిస్ట్రేషన్లు చేసి స్క్రీనింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు..

Kadapa Army Recruitment Rally: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ! నేరుగా వెళ్లొచ్చు
Kadapa Agniveer Army Recruitment Rally
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 10, 2024 | 6:31 AM

కడప, నవంబర్ 10: దేశ సైన్యంలో చేరి సేవలందించేందుకు ఎదురు చూస్తున్న యువతకు కేంద్రం మంచి అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడపలో డీఎస్‌ఏ స్టేడియంలో నవంబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆదివారం (నవంబర్‌ 10) నుంచి ఆర్మీ ర్యాలీ మొదలవనుంది. మొదటిదశలో తమను తాము నిరూపించుకున్న వారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన యువత నేరుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్న స్టేడియం వద్దకు చేరుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. డీఎస్‌ఏ స్టేడియం మెయిన్‌ గేట్‌ వద్ద కుడి వైపున ఉన్న ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్ద రిజిస్ట్రేషన్లు చేస్తారు. అనంతరం అభ్యర్ధులందరూ ఆర్మీ అధికారుల సూచనల ప్రకారం ఆయా దశల్లో పాల్గొనాలి.

అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు..

అభ్యర్థులు గడ్డంతో రాకూడదు. నీట్‌గా షేవ్‌ చేసుకుని హాజరవ్వాలి. నకిలీ ధ్రువపత్రాలు తీసుకు రాకూడదు. ఎంపికలకు సంబంధించి వివరాలు, ఏవేని సందేహాలకు రిక్రూట్‌మెంట్‌ ఆఫీసు సిబ్బందిని మాత్రమే అడిగి తెలుసుకోవాలి. ఇతరులను సంప్రదించి మోసపోవద్దు. అభ్యర్ధులకు వ్యాధులు, గాయాలుంటే అనుమతించరు. ఏజెంట్లను నమ్మి ఎవరైనా డబ్బులిచ్చారని తేలిస్తే.. అలాంటి వారిని ర్యాలీకి అనుమతించరు. వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. అలాగే శరీరంపై ముంజేయి అడుగున, మోచేయి వెనుక అడుగు భాగాన, మణికట్టు ముందు, వెనుక భాగాన మినహాయించి శరీరంలో వేరే ఎక్కడైనా పచ్చబొట్టు ఉంటే అటువంటి వారిని పరీక్షలకు అనుమతించరు.

ఆర్మీ ర్యాలీలో అన్ని పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇండోర్‌ స్టేడియంలో మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. అలాగే స్క్రీనింగ్‌ సమయంలో అభ్యర్థులకు ఏమైనా గాయాలు తగిలితే.. వారికి అక్కడే ఉన్న వైద్యశిబిరంలో చికిత్స అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇక్కడి గుడారాల్లో వసతి కల్పించారు. ర్యాలీలో పాల్గొనే వారు ముందుగా కడపకు చేరుకుని కాస్త విశ్రాంతి తీసుకుని స్క్రీనింగ్‌లో పాల్గొనవచ్చు. అందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. కడప రైల్వే స్టేషన్‌ నుంచి డీఎస్‌ఏ స్టేడియానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. స్టేషన్‌లో దిగిన అభ్యర్థులు ఆటో ఎక్కి నేరుగా స్టేడియానికి చేరుకొవచ్చు. ఇక కడప ఆర్టీసీ బస్టాండు నుంచి స్టేడియం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోలు వస్తాయి. పాత బస్టాండు నుంచి కూడా చేరుకోవచ్చు. ఈ ర్యాలీలో మొత్తం 13 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.