Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 4 Appointment Orders: ‘ఆ రోజున గ్రూప్‌ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తాం’ డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

తెలంగాణ గ్రూప్ 4 అభ్యర్ధులకు రేవంగ్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలో జరగనున్న ప్రజా వియజోత్సవాల్లో గ్రూప్ 4కు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శనివారం జరిగిన సబ్‌కమిటీ భేటీలో వెల్లడించారు..

TGPSC Group 4 Appointment Orders: 'ఆ రోజున గ్రూప్‌ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తాం' డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
Deputy CM Bhatti Vikramarka
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 10, 2024 | 6:56 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 10: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తుది ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడి పూర్తికావస్తున్న నేపథ్యంలో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రూప్‌ 4 అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై తాజాగా ప్రజా విజయోత్సవాలు ఏవిధంగా జరపాలి, ఏ అంశాలపై ప్రచారం చేయాలనే దానిపై విధివిధానాలు రూపొందించేందుకు భట్టి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ శనివారం (నవంబర్‌ 9) సమావేశమైంది. ఈ మేరకు ఉత్సవాల నిర్వహణపై సబ్‌కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజుతో ముగియనున్నాయి. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 25 రోజులపాటు విజయోత్సవాలు జరగనున్నాయి. విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఇందులో పలు కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ప్రజలకు ఈ కార్యక్రమాల ద్వారా వివరించేలా కార్యచరణ రూపొందించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు ఈ సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్‌ 4కు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. చివరి రోజైన డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లో భారీగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 తుది ఫలితాలను తక్షణమే ప్రకటించాలని గత కొంతకాలంగా నిరుద్యోగులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితాలు ప్రకటించి, వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 8,180 గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి 1:3 నిష్పత్తిలో జనరల్ మెరిట్‌ జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేశారు. అయితే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం గ్రూప్‌-4 పోస్టుల తుది ఫలితాలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. దీంతో గత 2 నెలలుగా దీని ప్రక్రియ అట్టడుగున పడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.