Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. 8వేల ఉద్యోగాలతో భారీ జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే..
కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకవేళ ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసినా..
కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకవేళ ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసినా మహమ్మారి భయంతో చాలామంది విద్యార్థులు హాజరుకాలేకపోయారు. ఇలాంటి విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున జాబ్ ఫెయిర్ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రముఖ ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇంటర్న్‌శాల’. ఇందులో భాగంగా వివిధ కంపెనీల్లో 8 వేలకు పైగా ఉద్యో్గాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఫ్రెషర్స్‌తో పాటు డిగ్రీ చివరి సంవత్సరం అభ్యసించనున్న విద్యా్ర్థులు కూడా ఈ జాబమేళాలో పాల్గొనవచ్చు.
ఖాళీల వివరాలివే… అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌సీఎల్, కోటక్ మహీంద్ర బ్యాంక్, First cry, People, వయాకామ్ ఇండియా, ఫోన్ పే వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, కంటెంట్ రైటింగ్, హ్యూమన్ రీసోర్సెస్, మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైన్స్, యూఐ/యూఎక్స్ డిజైన్ తదితర విభాగాల్లో మొత్తం 8వేల ఖాళీల కోసం అభ్యర్థులను అన్వేషించనున్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి 2.75- 20 లక్షల వేతనం అందిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 10లోపు తమ అధికారిక వెబ్‌సైట్ https://internshala.com/ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్న్‌శాల సీఈవో తెలిపారు.
Also Read: