AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs In HAL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే.. చివరి తేది ఎప్పుడంటే..

Job Notification In HAL: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను..

Jobs In HAL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే.. చివరి తేది ఎప్పుడంటే..
Narender Vaitla
|

Updated on: Mar 01, 2021 | 5:29 PM

Share

Job Notification In HAL: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ నొటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను hal india.co.inలో పొందొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నాసిక్ డివిజన్‌లో పలు అంప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాల్సిందిగా తెలిపారు. మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు.

ఖాళీల వివరాలు..

ఫిట్టర్ – 210 టర్నర్ – 28 మిషనిస్ట్ – 26 కార్పేంటర్ – 03 ఎలక్ట్రిషియన్ – 78 డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్)-08 ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 08 పెయింటర్ (జనరల్)-08 షీట్ మెటల్ వర్కర్ – 04 మెకానిక్ – 04 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 77 వెల్డర్ – 10 స్టెనో గ్రాఫర్ – 08

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాలి.

* అనంతరం అప్లికేషన్ ఫామ్‌లో పేర్కొన్న అంశాలను అందించి సబ్మిట్ బటన్‌పై నొక్కాలి.

* అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థికి ఒక మెయిల్ వస్తుంది.

* అనంతరం అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీనీ ప్రింట్ తీసుకోవాలి.

* పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి… https://hal-india.co.in/Common/Uploads/Resumes/1361_CareerPDF1_ITI%20ADVT%2020FEB21.pdf

Also Read: Aadhaar Authentication History : గత ఆరునెలల్లో ఆధార్ కార్డుని ఎన్ని సార్లు ఉపయోగించారో తెలుసుకోవడం ఎలా అంటే..!

చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం.. ఉపాది శిక్షణతోపాటు ఫ్రైజ్ మనీగా రూ.8000.. ఎలా చేరాలో తెలుసా..