చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం.. ఉపాది శిక్షణతోపాటు ఫ్రైజ్ మనీగా రూ.8000.. ఎలా చేరాలో తెలుసా..

Pradhana Manthri Kaushal Vikas Yojana: చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం. ఎలాగో తెలుసా.. ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన పథకంలో

  • Rajitha Chanti
  • Publish Date - 4:22 pm, Mon, 1 March 21
చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం.. ఉపాది శిక్షణతోపాటు ఫ్రైజ్ మనీగా రూ.8000.. ఎలా చేరాలో తెలుసా..

Pradhana Manthri Kaushal Vikas Yojana: చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం. ఎలాగో తెలుసా.. ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన పథకంలో చదువులను మధ్యలో ఆపేసిన యువతకు.. అలాగే నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీనిని జూలై 2015లో ప్రారంభించారు. ఇందులో మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరం వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తైన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థలలో ఈ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన కింద 2022 నాటికి దేశంలో దాదాపు 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శిక్షణ తర్వాత స్వయం ఉపాధి కోసం లోన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. తాజాగా ఈ పథకం మూడవ దశ ప్రారంభమైంది. పీఎంకేవీవై 3.0 (2020-21) ఎనిమిది లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి కేంద్రం వెచ్చించిన అమౌంట్ రూ.948.90 కోట్లు. ఇందులో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో 717 జిల్లాల్లో పీఎంకెవివై 3.0 ప్రారంభించినట్లు నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎలా నమోదు చేసుకోవాలంటే..

ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన (పీఎంకెవివై)లో చేరాలంటే ముందుగా ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఇందుకు ముందుగా http://pmkvyofficial.org వెబ్ సైట్ ఓపెన్ చేసి.. మీ పేరు, మీ చిరునామా, ఈమెయిల్ సమాచారాన్ని ఫీల్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏదైతే కోర్సు చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. కన్‏స్ట్రక్షన్స్, ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్నిచర్ & ఫిట్టింగ్, హ్యాండిక్రాఫ్ట్, జెమ్స్ & జ్యువెల్లరీ, లెదర్ టెక్నాలజీ వంటి 40 రకాల సాంకేతిక కోర్సులను పీఎంకేవివై అందిస్తుంది. ఇక మీకు నచ్చిన కోర్సుతోపాటు మరో కోర్సును కూడా సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీకు నచ్చిన ట్రైనింగ్ సెంటర్‏ను ఎంచుకోవాలి.

పీఎంకేవీవై (PMKVY).. 

ప్రధానమంత్రి స్కిల్ డెవలప్ మెంట్ స్కీం (పీఎంకేవీవై) ట్రైనింగ్ తీసుకోవడానికి ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ప్రభుత్వమే రూ.8000లను ఫ్రైజ్ మనీగా అందిస్తుంది. 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఉంది. కోర్సు పూర్తిచేసిన తర్వాతే సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక ఆ సర్టిఫికేట్ దేశంలో ఎక్కడైన పనిచేస్తుంది. శిక్షణ తర్వాత, ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఉద్యోగాలు పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం లక్ష్యం తక్కువ చదువుకున్న వారు, చదువు మధ్యలో ఆపేసిన వారిరికి ఉద్యోగావకాశం కల్పించడం. పీఎంకేవీవై శిక్షణ ఫూర్తైన తర్వాత మిమ్మల్ని మీ సంస్థ ముందుగా పరీక్షీస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తర్వాత సర్టిఫికేట్ స్కిల్స్ సర్టిఫికేట్ అందిస్తుంది.

Also Read:

COVID-19 Vaccination Certificate: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందండిలా.. వివరాలు ఇవే..

‘ఈ నది నన్ను ఆహ్వానిస్తోంది, ఇక మరణమే శరణ్యం’, సూసైడ్ వీడియోలో ముస్లిం యువతీ

LPG Gas Cylinder: వినియోగదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఈసారి ఎంతంటే..!