కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి యూపీఎస్సీ సూచనలు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసా ?
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నావల్ అకాడమీ (NIA) సంస్థలలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నావల్ అకాడమీ (NIA) సంస్థలలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులలో ప్రవేశానికి ఏప్రిల్ 18న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 2, 2022 నుంచి కోర్సులు ప్రారంభంకానున్నాయి.
ఇప్పటివరకు ఈ కోర్సులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్కు మూడు వారాల ముందు హాల్ టికేట్స్ జారీ చేయనుంది. అడ్మిట్ కార్డు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ Upc.gov.in.లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా యూపీఎస్సీ 400 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 370 నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉండగా.. ఆర్మీలో 208, నేవీలో 42, వైమానిక దళానికి 120 (గ్రౌండ్ డ్యూటీలకు 28తో కలిపి) ఉన్నాయి. ఇందులో నావల్ అకాడమీలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
యూపీఎస్సీ (UPSC) నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే పై కోర్సులకు ప్రవేశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్ లలో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్ అగర్తాలా, అహ్మదాబాద్, ఐజాల్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), బెంగుళూరు, బరేలీ, భోపాల్, చండీగఱ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, ధార్వాడ్, డిస్పూర్, గ్యాంగ్ టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైనాఘర్ ప్రాంతాలలో ఎగ్జామ్ జరగనుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 89 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి మార్చి18 చివరి తేదీ. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
Also Read: