‘ఈ నది నన్ను ఆహ్వానిస్తోంది, ఇక మరణమే శరణ్యం’, సూసైడ్ వీడియోలో ముస్లిం యువతీ
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 23 ఏళ్ళ యువతి శబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆయేషా ఆరిఫ్ ఖాన్ అనే ఈ యువతి తన బలవన్మరణానికి ముందు తన మొబైల్ లో వీడియోను కూడా తీస్తూ ఇది తన సొంత నిర్ణయమని,
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 23 ఏళ్ళ యువతి శబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆయేషా ఆరిఫ్ ఖాన్ అనే ఈ యువతి తన బలవన్మరణానికి ముందు తన మొబైల్ లో వీడియోను కూడా తీస్తూ ఇది తన సొంత నిర్ణయమని, ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ప్రశాంతంగా మరణిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తను పోరాడదలచలేదని, తన తండ్రికి తెలిపింది. ‘ఐ లవ్ ఆరిఫ్..’ అని కూడా తన భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. వరకట్న దాహానికి గురవుతున్న అనేకమంది అభాగినుల్లో ఆయేషా కూడా ఒకరు. 2018 లో రాజస్తాన్ లో నివసించే ఆరిఫ్ అనే వ్యక్తితో ఈమె వివాహం జరిగింది. పెళ్లయిన మరునాటి నుంచే అదనపు కట్నం కోసం ఈమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి వేధింపులు భరించలేక వీరంతా తనపై గృహ హింసకు పాల్పడుతున్నారని అయేషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక.. కోర్టులో కేసు కూడా పెట్టింది.
ఓ బ్యాంకులో పని చేస్తూ వచ్చినప్పటికీ ఈమెకు అత్తింటివారి బెదిరింపులు, వేధింపులు ఆగలేదు. ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించిన అయేషా శబర్మతి నది ఒడ్డున నిలబడి.. తన తలిదండ్రులకు ఫోన్ చేసింది. అల్లా వద్ద తాను శాంతియుతంగా ఉంటానని,మీరు ఈ కేసు ఎన్నాళ్లని వదిస్తారని తన తండ్రిని ఆమె ప్రశ్నించింది. నేను ఫైట్ చేయాలనుకోవడంలేదు.. ఆరిఫ్ (తన భర్త) స్వేఛ్చ కోరితే అతడిని అది అనుభవించనివ్వండి..’ అని ఇలాగే చాలా మాట్లాడింది. తన భర్తకు ఫోన్ చేస్తే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అతగాడు దురుసుగా మాట్లాడాడట.. చివరకు తన తలిదండ్రులు తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగానే, ఎలాంటి అనుచిత నిర్ణయం తీసుకోవద్దని వారిస్తుండగానే అయేషా ఫోన్ కట్ చేసి నదిలోకి దూకింది. ఆమెను రక్షించేందుకు కొంతమంది ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. స్పృహ కోల్పోయి ఉన్న ఆమెను వారు ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆమెమరణించిందని డాక్టర్లు ప్రకటించారు. వరకట్న దాహానికి అయేషా అలా బలయిపోయింది.
#ayesha It doesn’t matter which religion you belong ! Humanity is Still first
Every Word she was Saying Makes anyone Emotional ! JUST LISTEN AND WATCH THE VIDEO !!
23 year old Ayesha releases this Video before Jumping in the #SabarmatiRiver #Ahmedabad! pic.twitter.com/EdmNd77ezJ
— Ayush Vaishnav (@AyushVa21516182) February 28, 2021
I’m Muslim and I’m ashamed for what happened to #Ayesha. ?
— ?⚫அம்பேத்கர் வழியில்⚫? (@TamilAmbedkar) March 1, 2021
Read More :