JEE Main 2024 Answer Key: జేఈఈ మెయిన్ ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఏప్రిల్ 14 వరకు అభ్యంతరాలకు ఛాన్స్
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ' తాజాగా విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 319 సిటీల్లో పరీక్ష జరిగింది. జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష సమాధాన ఆన్సర్ 'కీ'ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ తాజాగా విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 319 సిటీల్లో పరీక్ష జరిగింది. జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష సమాధాన ఆన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లనూ కూడా ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 14వ తేదీ వరకు లేవనెత్తవచ్చని ఎన్టీయే స్పష్టం చేసింది. ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఆన్‌లైన్ మాత్రమే ఛాలెంజ్ చేయాలని పేర్కొంది. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయనున్నారు.
జేఈఈ మెయిన్ 2024 ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ 2024 రెస్పాన్స్ షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీయూఈటీ పీజీ 2024 ఫలితాలు విడుదల
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ పీజీ 2024) పీజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 157 సబ్జెక్టుల్లో మార్చి 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.