AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 Mains Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష తేదీలివే.. ప్రిలిమ్స్‌లో ఎంత మంది అర్హత సాధించారంటే

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్‌ 12) విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది అంటే 84.67 శాతం మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే పరీక్షకు మాత్రం 91,463 మంది మాత్రమే హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు 91,463 అంటే 72.55 శాతం మంది..

APPSC Group 1 Mains Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష తేదీలివే.. ప్రిలిమ్స్‌లో ఎంత మంది అర్హత సాధించారంటే
APPSC Group 1 Mains
Srilakshmi C
|

Updated on: Apr 14, 2024 | 1:55 PM

Share

అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్‌ 12) విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది అంటే 84.67 శాతం మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే పరీక్షకు మాత్రం 91,463 మంది మాత్రమే హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు 91,463 అంటే 72.55 శాతం మంది, పేపర్ 2 పరీక్షకు 90,777 అంటే 72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.

తాజా ఫలితాల్లో 1:50 చొప్పున పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరితోపాటు గ్రూప్‌ 1 ఫలితాల్లో ట్యాంపరింగ్, ఓఎంఆర్‌ షీట్‌పై బుక్‌లెట్‌ సీరియల్‌ నంబర్లు లేకపోవడం, మల్టిపుల్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్లు నమోదు చేయడం వంటి వివిధ కారణాల వల్ల 567 మంది అభ్యర్ధులు రిజెక్ట్‌ అవగా వారి వివరాలను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌ 1 ఫలితాలతోపాటు పేపర్ 1, 2లకు సంబంధించిన తుది ఆన్సర్‌ ‘కీ’లను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన 24 రోజుల్లోనే కమిషన్‌ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

కాగా మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియను చేపడుతోంది. తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 4,496 మంది అభ్యర్థులను కమిషన్‌ ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!