JEE Main 2023: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ ఎప్పుడంటే..
ఇంజనీరింగ్ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు అలర్ట్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే...
ఇంజనీరింగ్ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు అలర్ట్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు గురువారం నుంచి జనవరి 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు Jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ ఫస్ట్ ఫేజ్ పరీక్ష వచ్చే నెల 24,25,27,28,29,30,30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక సెకండ్ ఫేజ్ పరీక్షలను ఏప్రిల్ 6,7,8,9,10,11,12 తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్షను ఎన్టీఏ మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. వీటిలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, అసోమీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడం, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ్, ఉర్దూ, ఒడియా భాషలు ఉన్నాయి. ప్రతీ ఏటా జేఈఈ మెయిన్స్‌కు సుమారు 10 లక్షల మంది హాజరవుతారు. వీరిలో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన వారికి ఐఐటీల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
జేఈఈ మెయిన్ 2023కి సంబంధించి ముఖ్యమైన విషయాలు..
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమవుతుంది.
* దరఖాస్తుల స్వీకరణ జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది.
* ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు 2023 జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటలకు ముగుస్తుంది.
* అడ్మిట్ కార్డులను జనవరి మూడో వారంలో విడుదల చేస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..