Inspiring Story: ఎస్‌ఐ ఉద్యోగానికి తల్లీ, కూతుళ్లు.. ఫిజికల్ ఈవెంట్స్‌లో సెలక్ట్.. ఒక్క అడుగు దూరంలో ఉన్న కల

నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. భర్త వ్యవసాయ కూలి కావడంతో నాగమణిలోని క్రీడా ఆసక్తిని ప్రోత్సహిస్తూ వచ్చారు. జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో సైతం నాగమణి పాల్గొన్నారు.

Inspiring Story: ఎస్‌ఐ ఉద్యోగానికి తల్లీ, కూతుళ్లు.. ఫిజికల్ ఈవెంట్స్‌లో సెలక్ట్.. ఒక్క అడుగు దూరంలో ఉన్న కల
Mother And Daughter Si Selection Race
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 12:21 PM

సాధించాలనే పట్టుదల.. చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నతస్థాయికి చేరుకోవాలనే ఆ తల్లి తపన ఫలించింది. అమ్మ ఎంచుకున్న మార్గాన్ని తాను లక్ష్యంగా చేసుకున్న ఆ కూతురి తొలి ప్రయత్నంలో కూతురు కూడా గోల్‌ని రీచ్ అయింది. తల్లీ, కూతురి పట్టుదల కారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు ఎస్‌ఐలను తయారు చేసింది. ఈసంఘటన ఖమ్మం జిల్లా వేదికైంది. ఖమ్మం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫిజికల్ ఈవెంట్స్‌ల్లో తల్లీ, కూతురు సెలక్ట్ అయి ఎస్‌ఐ ఉద్యోగానికి అర్హత పొందారు. ఇక ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఫైనల్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే.. ఎస్ఐ కావాలన్న తల్లీ కూతుళ్ల కల నెరవేరబోతోంది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన దారెళ్లి నాగమణి ప్రస్తుతం ములుగు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 37ఏళ్ల నాగమణితో పాటు ఆమె కుమార్తె 21సంవత్సరాల త్రిలోకిని కూడా ఎస్‌ఐ ఉద్యోగానికి నిర్వహించిన ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. ఖమ్మం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన లాంగ్ జంప్, షాట్ పుట్, 800 మీటర్ల రన్నింగ్‌లో క్వాలిఫై అయ్యారు.. తల్లీ, కూతురు ఇద్దరూ ఒకే బ్యాచ్ లో ఈవెంట్స్ లో పాల్గొని ఒకేసారి అర్హత సాధించడం విశేషం.

నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. భర్త వ్యవసాయ కూలి కావడంతో నాగమణిలోని క్రీడా ఆసక్తిని ప్రోత్సహిస్తూ వచ్చారు. జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో సైతం నాగమణి పాల్గొన్నారు. నాగమణి 2005 లో అంగన్వాడీ టీచర్‌గా, 2007 లో హోమ్ గార్డుగా పని చేశారు.. పోలీస్ కావాలని ధ్యేయం తో 2020 లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపిక అయ్యారు.. మొదట ఖమ్మం పోలీస్ స్టేషన్లో పని చేసి ఇటీవల ములుగు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.. కూతురు ఖమ్మం లో డిగ్రీ పూర్తి చేసి. ఎస్ ఐ ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యారు.. మొదట ప్రిలిమ్స్ పరీక్ష లో అర్హత సాధించి ఈవెంట్స్ కు సాధన చేసి.. ఇద్దరూ క్వాలిఫై అయ్యారు… ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్‌లో అర్హత సాధిస్తే తల్లీ కూతురు..ఎస్ ఐ కాబోతున్నారు.. కష్టపడి పట్టుదలతో ఇంత వరకూ సాధించామని.. తల్లిదండ్రులు ప్రోత్సహించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..