AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITEP 2024 Notification: ఇంటర్‌ తర్వాత ITEPతో నేరుగా నాలుగేళ్ల బీఈడీ.. ఏప్రిల్ 30తో ముగుస్తోన్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు

బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్ధులు డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చని తెలిపింది. ఈ కోర్సులో జాయిన్‌ అంతే బీఎడ్‌ కోర్సును రెండేండ్లకు బదులుగా ఏడాదిలోనే పూర్తిచేయొచ్చని తెలిపింది. ఈ అవకాశం కల్పిస్తున్న నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కోర్సును తొలుత రాష్ట్రంలోని..

ITEP 2024 Notification: ఇంటర్‌ తర్వాత ITEPతో నేరుగా నాలుగేళ్ల బీఈడీ.. ఏప్రిల్ 30తో ముగుస్తోన్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ITEP 2024 Notification
Srilakshmi C
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 07, 2025 | 4:57 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 15: బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్ధులు డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చని తెలిపింది. ఈ కోర్సులో జాయిన్‌ అంతే బీఎడ్‌ కోర్సును రెండేండ్లకు బదులుగా ఏడాదిలోనే పూర్తిచేయొచ్చని తెలిపింది. ఈ అవకాశం కల్పిస్తున్న నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కోర్సును తొలుత రాష్ట్రంలోని మూడు విద్యాసంస్థల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే నిర్వహిస్తున్నారు. ఐటీఈపీ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకునే వారు దేశవ్యాప్తంగా నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఎన్‌సీఈటీ) పేరిట నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయవల్సి ఉంటుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 2024 -25 విద్యాసంవత్సరానికి ఎన్‌సీఈటీ ప్రవేశపరీక్షకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్‌ 12న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు www. nta.ac.in, https://ncet.samarth.ac.in/ వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.

నాలుగేళ్ల ఎన్‌సీఈటీ 2024 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ మూడు కాలేజీల్లో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మౌలానా అజాద్‌ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, బీకాం బీఎడ్‌.. అనే 3 కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. వీటిల్లో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీ వరంగల్‌లోనూ బీఎస్సీబీఎడ్‌ కోర్సుతో 50 సీట్లు, లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ బీఎడ్‌ కోర్సులో మరో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏప్రిల్‌ 21న ఏపీ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంంగా ఉన్న మోడల్‌ స్కూల్స్‌ (ఆదర్శ పా­ఠ­శాలలు)లలో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు కోసం ఏప్రిల్‌ 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా­శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుంది. ప్రశ్నాపత్రం తెలుగు/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌ టికెట్లు https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్‌­సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..