Indian Navy Jobs: ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్‌క్వార్టర్స్ అయిన అండమాన్ నికోబార్ కమాండ్‌లోని పలు యూనిట్లలో ఉన్న గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్‌క్వార్టర్స్ అయిన అండమాన్ నికోబార్ కమాండ్‌లోని పలు యూనిట్లలో ఉన్న గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 112 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌నెట్‌వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్‌ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రీయల్ పెయింటర్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట దరఖాస్తుల స్క్రీనింగ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 06-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…