Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డులో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోస్ట్ గార్డ్ విభాగానికి చెందిన ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్..
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోస్ట్ గార్డ్ విభాగానికి చెందిన ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 02/2022 బ్యాచ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 322 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో నావిక్(జనరల్ డ్యూటీ)-260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-35, యాంత్రిక్(మెకానికల్)-13, యాంత్రిక్(ఎలక్ట్రికల్)-09, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)-05 ఖాళీలు ఉన్నాయి. * నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి. * నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి. * యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను మొత్తం 4 స్టేజ్‌ల్లో ఎంపిక చేయనున్నారు. * దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 04-01-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 14-04-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..
Hiccups: మీకు పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? తగ్గిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..!
Hiccups: మీకు పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? తగ్గిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..!