Indian Army Soldier: మహిళా మిలటరీ పోలీసు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూలై 20
Indian Army Soldier: ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్మీ అనేక నోటిఫికేషన్లు

Indian Army Soldier: ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్మీ అనేక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇక మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీ సోల్జర్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ జనరల్ డ్యూటీ (మహిళ మిలటరీ పోలీసు) నియమకానికి భారత సైన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఇడియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2021 కోసం అధికారిక వెబ్ సైట్ (joinindianarmy.nic.in) ద్వారా 06 జూన్ 2021 నుండి 2021 జూలై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీ ఉమెన్ సోల్జర్ కోసం దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణలై ఉండాలి. 2000 అక్టోబర్ నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. అయితే భారత సైన్యం అంబాలా, లక్నో, బబల్‌పూర్, బెల్గాం, పూణే మరియు షిల్లాంగ్ వద్ద నియామక ర్యాలీ నిర్వహించనుంది. ర్యాలీకి అడ్మిట్ కార్డులు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ద్వారా పంపబతాయి. అభ్యర్థులకు వారి సొంత జిల్లాల ఆధారంగా వేదిక కేటాయించనున్నారు. మొత్తం 100 పోలీసు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఆర్మీ వెబ్‌సైట్ ను సంప్రదించాలి.




