India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. అర్హత, ఎంపిక, జీతభత్యాల సమాచారం ఇదే..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Sep 04, 2022 | 3:34 PM

ఇండియా పోస్ట్‌ విభాగానికి చెందిన బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (India Post).. 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (Staff car driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

India Post Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. అర్హత, ఎంపిక, జీతభత్యాల సమాచారం ఇదే..
India Post Recruitment 2022

India Post Staff car driver Recruitment 2022: ఇండియా పోస్ట్‌ విభాగానికి చెందిన బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (India Post).. 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (Staff car driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే లైట్‌, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై అవగాహన ఉండాలి. సంబంధిత డ్రైవింగ్ పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 26, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులను పంపవల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.19,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Manager, Mail Motor Service, Bengaluru-560001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu