CNCI Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే నేరుగా..

పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉన్న చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (CNCI).. 27 స్పెషలిస్ట్ గ్రేడ్-1, 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

CNCI Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే నేరుగా..
Cnci Kolkata
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 04, 2022 | 3:15 PM

CNCI Kolkata Specialist Recruitment 2022: పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉన్న చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (CNCI).. 27 స్పెషలిస్ట్ గ్రేడ్-1, 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, యూరో ఆంకాలజీ, ప్లాస్టిక్ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ (గైనకాలజీ ఆంకాలజీ), అనస్తీషియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 50 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.