IIT Patna Recruitment 2023: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు జాబ్ అలర్ట్.. ఐఐటీలో 109 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల జీతం..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పాట్నలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ కాంట్రాక్టు ప్రాతిపదికన 109 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పాట్నలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ కాంట్రాక్టు ప్రాతిపదికన 109 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఎంబీబీఎస్/బీఈ/బీటెక్‌ఎంఈ/ఎంటెక్‌ఎంసీఏ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 50 నుంచి 57 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో మే 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో గ్రూప్ ఏ పోస్టులకు రూ.1500, గ్రూప్ బి పోస్టులకు రూ.1000, గ్రూప్ సీ పోస్టులకు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూబీఎప్/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.80,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.




పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.