IDRBT Recruitment: హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. బీటెక్‌ చేసిన అర్హులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

IDRBT Recruitment: హైదరాబాద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)కి చెందిన ఈ సంస్థలో పోస్టులను..

IDRBT Recruitment: హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. బీటెక్‌ చేసిన అర్హులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 06, 2022 | 6:35 AM

IDRBT Recruitment: హైదరాబాద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)కి చెందిన ఈ సంస్థలో పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అలాగే పైథాన్‌; జావా, పీహెచ్‌పీ, మైఎస్క్యూఎల్‌, మోంగోడీడీ, డిజాంగో నైణ్యాలు తెలిసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం సెలక్షన్‌ ప్రాసెస్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 24-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Andhra Pradesh: కీచక పాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు..

Andhra Pradesh: కీచక పాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు..

రష్మిక వదులుకున్న సినిమాలు ఏంటో తెలుసా.?