ICMR Recruitment 2022: ఐసీఎంఆర్‌లో జూనియర్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ICMR NIMR) జూనియర్ నర్సు, లేబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్‌తో సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను..
ICMR Recruitment 2022: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ICMR NIMR) జూనియర్ నర్సు, లేబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్‌తో సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ICMR రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా MBBS/ 12వ, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2022లోపు లేదా సాయంత్రం 05:00 గంటల వరకు ఐసీఎంఆర్ అధికారక వెబ్ సైట్‌లో ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు . మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ని చెక్ చేయండి.
ఖాళీల వివరాలు ఇలా..
జూనియర్ మెడికల్ ఆఫీసర్-02 లేబొరేటరీ టెక్నీషియన్-01 డేటా ఎంట్రీ ఆపరేటర్-03 ఫీల్డ్ వర్కర్-04 జూనియర్ నర్సు-03
విద్యార్హతలు..
జూనియర్ మెడికల్ ఆఫీసర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ. లేబొరేటరీ టెక్నీషియన్ – సైన్స్ సబ్జెక్టులో 12వ తరగతి ఉత్తీర్ణత, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్‌లో రెండేళ్ల డిప్లొమా. డేటా ఎంట్రీ ఆపరేటర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ లేదా 12వ ఉత్తీర్ణత. ఫీల్డ్ వర్కర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానం మరియు రెండేళ్ల ఫీల్డ్ అనుభవం. జూనియర్ నర్స్ – సైన్స్ సబ్జెక్టులతో ANM లో హై స్కూల్ లేదా సర్టిఫికేట్ కోర్సు
జీతం వివరాలు..
జీతం ఇవ్వబడుతుంది జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 60,000 (కన్సాలిడేటెడ్) జీతం ఇవ్వబడుతుంది. ఇది కాకుండా, లేబొరేటరీ టెక్నీషియన్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), ఫీల్డ్ వర్కర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్) , జూనియర్ నర్సు అభ్యర్థులకు రూ.17,520 (కన్సాలిడేటెడ్) ఇవ్వబడుతుంది.
ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..
PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..