AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్ఎండీసీ విడుదల చేసింది.

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా చేసుకోండి..
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2022 | 3:16 PM

Share

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్ఎండీసీ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్ nmdc.co.in ని సందర్శించడం ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2 మార్చి, 2022 గా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 పోస్టులు భర్తీ చేయనుననారు. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హతలు.. వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు భిన్నంగా ఉన్నాయి. వయోపరిమితి, విద్యార్హత వంటి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అప్లికేషన్ ఫీజు.. అభ్యర్థులు రూ. 150 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwD/ex-servicemen కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

పోస్టుల సమగ్ర వివరాల లింక్: పోస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోండి. (పోస్టుల వివరాల లింక్)

ఎలా దరఖాస్తు చేయాలంటే.. 1: ఎన్ఎండీసీ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2: హోమ్‌పేజీలో అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి 3: దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. 4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి 5: ఆపై, అప్లికేషన్ ఫీజు చెల్లించండి. 6: ‘‘సబ్‌మిట్’’ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Also read:

MLC Kavitha: ఇంకోసారి కేసీఆర్‌పై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్డార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్!

Andhra Pradesh: డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది

RBI Recruitment: నిరుద్యోగులకు సదావకాశం.. ఆర్‌బీఐలో 950 ఖాళీలు, ఎలా ఎంపిక చేస్తారంటే..