Staff Nurse Posts In Guntur: గుంటూరు సమగ్ర వైద్యశాలలో స్టాఫ్ నర్సుల పోస్టులు.. నేడే ఇంటర్వ్యూ..
Staff Nurse Posts In Guntur Govt Hospital: కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైద్య సిబ్బందిని పెద్ద...

Staff Nurse Posts In Guntur Govt Hospital: కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇప్పటకే పలు ప్రభుత్వ రంగ సంస్థలు వైద్య ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు సమగ్ర వైద్య శాలలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో స్టాఫ్ నర్సులతో పాటు పలు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 స్టాఫ్ నర్సులతో పాటు, అనిస్థీషియా టెక్నిషియన్స్ 20, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు ఆరు నెలల కాంట్రాక్టు విధానంలో తీసుకోనున్నారు.
* ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నేడు (08-05-2021 శనివారం) ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ విద్యార్హత జిరాక్స్ సెట్‌తో సూపరింటెండెట్, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతుందా..? ఈ సమస్య అందరికి వస్తుందా..! తెలుసుకోండి..
SDM జాబ్ గురించి మీకు తెలుసా..? జీతం ఎంత వస్తుంది..! సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు..
