AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ – 1 నోటిఫికేషన్ రిలీజ్.. ఆ తేదీ నుంచే దరఖాస్తులు

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ కార్యదర్శి..

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ - 1 నోటిఫికేషన్ రిలీజ్.. ఆ తేదీ నుంచే దరఖాస్తులు
Group- 1
Ganesh Mudavath
|

Updated on: Oct 01, 2022 | 7:08 AM

Share

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్డ్ మెంట్ లో 17 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి నవంబర్‌ 2 నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వాటికి అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ను సందర్శించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గ్రూప్‌–1 పోస్టులు 92 ఉన్నాయి. మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 17 ఉన్నాయి. ఏఎంవీఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు గడువు విధించారు.

మరోవైపు.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌–1 సహా ఇతర అత్యున్నత కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. 2023 సెప్టెంబర్‌ 30వరకు అమల్లో ఉంటుంది.

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి ఉద్యోగాలు కల్పించిందని సీఎం జగన్ చెప్పారు. కాంట్రాక్ట్‌ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్‌ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 51,387, వైద్య ఆరోగ్య రంగంలో రికార్డు స్థాయిలో 16,880 రెగ్యులర్‌ ఉద్యోగాలు, పాఠశాల విద్యాశాఖలో 6,360 ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.