Government Internship 2022: డిగ్రి అర్హతతో ఇంటర్న్‌షిప్.. నెలకు 10 వేల స్టైఫండ్.. కేంద్ర ప్రభుత్వ అద్భుత అవకాశం..!
Government Internship 2022: గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశాన్ని కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి
Government Internship 2022: గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశాన్ని కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కింద MEA ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి సెషన్‌ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ద్వారా MEA ఇంటర్న్‌షిప్ 2022 పాలసీ ప్రకారం.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సాధారణ ప్రజా ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాల కోసం విదేశీ విధానంపై అవగాహన పెంపొందించడానికి ఇంటర్న్‌లుగా పని చేసే అవకాశం ఇవ్వబడుతుంది.
MEA లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 10,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు.. సాధారణ ప్రజలలో విదేశాంగ విధానంపై అవగాహన పెంపొందించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇంటర్న్‌షిప్ మూడు నెలల వరకు ఉంటుంది.
ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయంటే.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇంటర్న్‌షిప్ కోసం మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. అధికారిక పోర్టల్ internship.mea.gov.in ను సందర్శించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ 15 ఫిబ్రవరి 2022 గా నిర్ణయించారు.
ఎంపిక ఎలా ఉంటుందంటే.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల నుండి అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ కోసం అభ్యర్థుల పేర్ల జాబితాను ఫిబ్రవరి 18న పోర్టల్‌లో విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. చివరకు ఎంపికైన అభ్యర్థుల పేర్ల జాబితాను ఫిబ్రవరి 28న విడుదల చేస్తారు.
అర్హత & వయో పరిమితి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు MEA ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఇంటర్న్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
Also read:
Fire Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..
Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..