Google Scholarship: కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.74 వేల స్కాలర్‌షిప్ అందిస్తున్న గూగుల్..
కంప్యూటర్ సైన్స్‌లో కెరీర్ సాధించాలని కలలు కంటున్న విద్యార్థులకు గూగుల్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక రంగంలో ఏదైనా చేయాలనుకునే విద్యార్థుల కోసం..
కంప్యూటర్ సైన్స్‌లో కెరీర్ సాధించాలని కలలు కంటున్న విద్యార్థులకు గూగుల్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక రంగంలో ఏదైనా చేయాలనుకునే విద్యార్థుల కోసం గూగుల్ స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానించింది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మహిళలకు జనరేషన్ గూగుల్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపికైన విద్యార్థులకు 1,000 డాలర్లు ప్రదానం చేస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో 74,760 రూపాయలను స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి..
ప్రస్తుతం 2021-2022 విద్యా సంవత్సరానికి అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలో పూర్తి-సమయం విద్యార్థిగా నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో మీరు ఆసియా పసిఫిక్ దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మీ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో మీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సంబంధిత టెక్నికల్ ఫీల్డ్ చదివారు. అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న గ్రూపులను మెరుగుపరచడానికి ఇంగ్లీష్‌లో ఒక వ్యాసం రాసి పంపించాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
- విద్యార్థులు ముందుగా వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ముందు ఓపెన్ అయ్యే పేజీలో Apply Now పై క్లిక్ చేయండి.
- ఆపై అభ్యర్థించిన సమాచారాన్ని పూరించండి.. సమర్పించండి.
- ఏదైనా స్కాలర్‌షిప్ సంబంధిత సమాచారం కోసం.. మీరు మీ ప్రశ్నను ఈ Google ఇమెయిల్ ఐడికి పంపవచ్చు.
స్కాలర్‌షిప్ కాకుండా మరే ఇతర సమాచారానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు. Google దీనికి సమాధానం ఇవ్వలేదు. సాంకేతిక రంగంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి Google తరచుగా ఇటువంటి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది. పేద, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల చదువుతున్నవారికి సహకరిస్తోంది. అంతేకాదు.. చదవులో ఉత్తమ ఫలితాలను అందుకుంటున్న నిరుపేద విద్యార్థులు.. వారి చదువు పూర్తి చేసుకునేలా సహకరిస్తోంది.
అలాంవంటి విద్యార్థులకు సహాయం చేయడానికి Google అనేక రకాల స్కాలర్‌షిప్‌లు, ప్రోగ్రామ్‌లను అమలు చేస్తుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు గూగుల్ ప్రత్యేకంగా మహిళల కోసం ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద బాలికలు తమ ప్రతిభ నుండి స్కాలర్‌షిప్ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..
Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..