GAIL Recruitment: ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
GAIL Recruitment: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ మహారత్న కంపెనీలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
GAIL Recruitment: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ మహారత్న కంపెనీలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా 14 ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆయుర్వేద, హోమియోపతి, ఈఎన్‌టీ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్స్, ఆప్తాలాలజిస్ట్ , కార్డియాలజిస్ట్, ఎండ్రోక్రైనాలజిస్ట్, సోనాలజిస్ట్/ రేడియాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ వంటి ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్ అయి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను శ్రీ శశాంక్ సక్సేనా, జీఎం (హెచ్‌ఆర్), న్యూ పాలిమర్ భవన్, గెయిల్ ఇండియా లిమిటెడ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం, అకడిమిక్ అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఇదరఖాస్తుల స్వీకరణకు 18-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
రోజ్ వాటర్‌తో చర్మం కాంతివంతం
Hyderabad: పెండింగ్ చలాన్లు చెల్లించలేదా.? బీకేర్ ఫుల్.. మీ ఇంటికి పోలీసులు వస్తుండొచ్చు..