Tamil Nadu: ఉద్యోగులు కంపెనీ వీడకుండా పెళ్లిళ్లు కుదురుస్తున్న ఐటీ కంపెనీ.. ఎక్కడో తెలుసా..
Arranging Marriages: ఎక్కడైనా ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కంపెనీలు జీతాలు పెంచటం, బోనస్ లు ఇవ్వటం లేక పోతే పొజిషన్ ఇవ్వటం లాంటివి చేస్తుంటాయి. ఐటీ కంపెనీల్లో అయితే భారీ ప్యాకేజీలను కూడా అందిస్తుంటాయి. కానీ..
Tamil Nadu: ఎక్కడైనా ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కంపెనీలు జీతాలు పెంచటం, బోనస్ లు ఇవ్వటం లేక పోతే పొజిషన్ ఇవ్వటం లాంటివి చేస్తుంటాయి. ఐటీ కంపెనీల్లో అయితే భారీ ప్యాకేజీలను కూడా అందిస్తుంటాయి. కానీ.. మధురైకి చెందిన శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (SMI) అనే కంపెనీ మాత్రం.. తన ఉద్యోగులకు మ్యాచ్ మేకింగ్(Arranging Marriages) సేవలను అందిస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు ఉద్యోగులు తమ సంస్థను వీడకుండా చూడాలని కొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. SMI తన 750 మంది ఉద్యోగులందరికీ సంవత్సరానికి రెండుసార్లు జీతంలో 6-8% స్థిరమైన హైక్ అందిస్తోంది. అయితే.. ఉద్యోగులు పెళ్లయ్యాక ఎక్కువ ఇంక్రిమెంట్లు పొందుతారు. ఇప్పుడు కంపెనీ ఉచితంగా మ్యాచ్‌మేకింగ్ సేవలను వారి ప్యాకేజీకి జోడించింది. చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరంలో కంపెనీ లేనందుకు ప్రతిభావంతులను ఆకర్షించడానికి కంపెనీ మొదట్లో చాలా కష్టపడ్డప్పటికీ.. ఇప్పుడు ఉద్యోగులతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నట్లు SMI CEO MP సెల్వగణేష్ వెల్లడించారు.
కంపెనీలోని ఉద్యోగులు తనను సోదరుడిలా చూసుకున్నారని.. వారికి వయసు పైబడిన తల్లిదండ్రులు ఉండటం వల్ల లేదా ప్రపంచం గురించి సరైన దృక్పథం లేకపోవడం వల్ల వారిలో చాలామంది పెళ్లి సంబంధాలను వెతుక్కోలేకపోతున్నారని సెల్వగణేష్ అంటున్నారు. అందుకే తమ ఉద్యోగుల కోసం.. మైత్రి మేకర్స్ నెట్‌వర్క్ ద్వారా అలాంటి ఉద్యోగులు సరైన వధువు లేదా వరుడిని ఎంచుకోవటంలో తాము సహాయం చేస్తామని సీఈవో సెల్వగణేష్ వివరించారు. ఈ విధానం ఫలితంగా కంపెనీ నుంచి ఉద్యోగులు మానేయటం చాలా సంవత్సరాలుగా 10% కంటే తక్కువగా ఉందని తెలిపారు. ప్రతిభావంతులైన ఉద్యోగులకు విపరీతమైన పోటీ ఉన్నందున ఐటి రంగంలో ఉద్యోగులను నిలుపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇటువంటి వాతావరణంలో కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి పే ప్యాకేజీలు, ప్రోత్సాహకాలకు మించి కొత్త వాటితో గ్యాలం వేస్తున్నాయి. తమ కంపెనీలో చాలా మంది ఉద్యోగులు ఎక్కువకాలం నుంచి పనిచేస్తున్నారని.. వారు ఎక్కడికీ వెళ్లరని భావించి మేము వారిని తేలిగ్గా తీసుకోలేమని సెల్వగణేష్ అంటున్నారు. అలాంటి ఆలోచన ఉద్యోగులకు రాకముందే మేము వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని కంపెనీ సీఈవో సెల్వగణేష్ అంటున్నారు.
ఇవీ చదవండి..
Crypto Tax: క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు కేంద్రం మరో షాక్.. కొత్తగా మరిన్ని పన్నులు..