Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Tax: క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు కేంద్రం మరో షాక్.. కొత్తగా మరిన్ని పన్నులు..

Crypto Tax: క్రిప్టోకరెన్సీల్లో డబ్బులు పెట్టే ఇన్వెస్టర్లను కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వదలటం లేదు. భారత్ బయట క్రిప్టో కరెన్సీ(Crypto Currency) ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వడ్డీలను ఆర్జించే భారతీయులను కూడా టాక్స్ అధికారుల స్క్రుటినీ కిందకు ప్రయత్నాలను వేగవంతం చేసింది.

Crypto Tax: క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు కేంద్రం మరో షాక్.. కొత్తగా మరిన్ని పన్నులు..
Crypto Tax
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 03, 2022 | 8:17 PM

Crypto Tax: క్రిప్టోకరెన్సీల్లో డబ్బులు పెట్టే ఇన్వెస్టర్లను కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వదలటం లేదు. భారత్ బయట క్రిప్టో కరెన్సీ(Crypto Currency) ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వడ్డీలను ఆర్జించే భారతీయులను కూడా టాక్స్ అధికారుల స్క్రుటినీ కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇలాంటి లావాదేవీలపై భారతీయులు ఆర్జించే వడ్డీ ఆదాయాలపై ఆదాయ పన్ను డిపార్ట్‌మెంట్(Income Tax Department) అదనపు టీడీఎస్‌ను, ఈక్విలైజేషన్ లెవీని విధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వేగంగా పెరుగుతోన్న ఈ సమయంలో ప్రభుత్వం పన్నులను దిశగా అడుగులు వేస్తోంది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనేది బ్లాక్ చెయిన్ అప్లికేషన్‌పై రూపొందిన ఫైనాన్సియల్ ఎకోసిస్టమ్. దీన్ని క్రిప్టో కరెన్సీలకు డబ్బులను అప్పుగా ఇవ్వడం లేదా ఇన్సూరెన్స్‌లను కొనుగోలు చేయడం, మనీ రెమిట్ చేయడం వంటి వాటికి వాడుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా చాలా మంది భారతీయులు ఒక నిర్దిష్ట కాలం కోసం క్రిప్టో కరెన్సీలను డిపాజిట్ చేసి, వడ్డీ ఆదాయాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 20 శాతం పన్ను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పాన్ కార్డు వివరాలు సమర్పించారో వారిపై ఈ టాక్స్ ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ విషయంపై సీబీడీటీ పన్ను నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీల ద్వారా ఆర్జించే వడ్డీ ఆదాయాలను ఎలా గుర్తించాలి..? వాటిని ఎలా పన్నుల కిందకు తీసుకురావాలి అనే విషయంపై టాక్స్ నిపుణులతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌లో డిజిటల్ ఆస్తుల నుంచి ఆర్జించే లాభాలు లేదా రిటర్నులపై 30 శాతం పన్నులను విధించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి లావాదేవీపై 1 శాతం టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(TDS) అమల్లోకి వస్తోంది. కానీ భారత్ వెలుపల చాలా మంది క్రిప్టో కరెన్సీలను డిపాజిట్ చేసి, వడ్డీలను పొందుతూ పన్నుల నుంచి తప్పించుకుంటున్నట్లు కేంద్రం గుర్తించింది.

చాలా మంది ఈ మధ్య కాలంలో నిర్దిష్ట కాలానికి క్రిప్టో కరెన్సీలను డిపాజిట్ చేసి, వడ్డీ ఆదాయాలను పొందుతున్నారు. భారతీయ పౌరులు కాకపోతే.. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వడ్డీపై 20 శాతానికి పైగా సర్‌ఛార్జ్ , సెస్‌ను ప్రభుత్వం విధించనుంది. అదే భారతీయ పౌరులపై 10 శాతానికి పైగా సర్‌ఛార్జ్, సెస్ ఉండబోతోందని తెలుస్తోంది. చాలా క్రిప్టో కంపెనీలు ఇటీవల కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తున్నాయి. వీటి ద్వారా డిజిటల్ ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసి, పన్నుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు అవి కల్పిస్తున్నాయి. దీంతో పన్ను ఎగవేతలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎగవేతలను అరికట్టేందుకు వీటిని కూడా పన్నుల కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు మెుదలు పెట్టింది.

ఇవీ చదవండి..

Payment Apps: ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ పై ఆర్బీఐ నజర్.. ఎందుకంటే..

Tax Planning: టాక్స్ సేవింగ్స్ ప్లానింగ్ ఆలస్యం చేయకండి.. ముందు చేసే వారికి ఎన్ని ఉపయోగాలో..