GAIL (India) Limited Recruitment:గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వేతనం రూ.2.40 లక్షలు.. పూర్తి వివరాలు
GAIL (India) Limited Recruitment:ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు..
GAIL (India) Limited Recruitment:ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి ఆయా సంస్థలు. ఇక తాజాగా గెయిల్ (ఇండియా) లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) ఇండియా నోటిఫికేషన్‌లో అనేక పోస్టుల భర్తీ చేస్తోంది. భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్‌సైట్ https://gailonline.com లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. చీఫ్ మేనేజర్‌లు (మెడికల్ సర్వీసెస్), సీనియర్ ఆఫీసర్స్ (మెడికల్ సర్వీసెస్) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
ఖాళీల వివరాలు చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్): 02 పోస్టులు సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్): 07 పోస్టులు
విద్యార్హత చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్): జనరల్ మెడిసిన్‌లో MD/DNBతో MBBS. సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్): MBBS డిగ్రీ.
గ్రేడ్, పే స్కేల్ చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్): గ్రేడ్ E-5, రూ. 90,000 – 2,40,000. సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్): గ్రేడ్ E-2, రూ. 60,000 – 1,80,000.
జనవరి 20, 2022 నాటికి వయోపరిమితి చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్): 40 సంవత్సరాలు సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్): 32 సంవత్సరాలు
ఎలా దరఖాస్తు చేయాలి అభ్యర్థులు గెయిల్ వెబ్‌సైట్ www.gailonline.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి .
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2022 (సాయంత్రం 06:00) వరకు.
ఇవి కూడా చదవండి: