CBSE Exams: సీబీఎస్ఈ సిలబస్ తగ్గిస్తున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

CBSE Board Syllabus: కరోనావైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. విద్యావవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. అన్నిచోట్ల ఏడాదికాలం నుంచి పాఠశాలలు, కళాశాలలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు.. తమ భవిష్యత్తు గురించి ..

CBSE Exams: సీబీఎస్ఈ సిలబస్ తగ్గిస్తున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బోర్డు
Shaik Madarsaheb

|

Feb 27, 2021 | 7:34 AM

CBSE Board Syllabus: కరోనావైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. విద్యావవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. అన్నిచోట్ల ఏడాదికాలం నుంచి పాఠశాలలు, కళాశాలలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు.. తమ భవిష్యత్తు గురించి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తర్వాత తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. కాగా.. ఎప్పుడెప్పుడు పరిస్థితులు సాధారణంగా మారుతాయోనని వారి తల్లీదండ్రులు కూడా ధీర్ఘాలోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో సడలించిన కరోనా మార్గదర్శకాలతో ఏడాదికి పైగా మూతపడిన విద్యాసంస్థలన్నీ ప్రస్తుతం మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. కానీ చాలాచోట్ల ఆన్‌లైన్ క్లాసులే నడుస్తున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులు పెద్దగా చదివిందేమి లేదు. దీంతో ఈ ఏడాది మొత్తం విద్యార్థుల చదువులు గందరగోళంగా సాగుతున్నాయి. ఒకవేళ క్లాసులకు హాజరుకావాలన్నా.. కొన్ని తరగతులకు మాత్రమే అనుమతిస్తున్నారు.

కరోనా నిబంధనలతో 50శాతం క్లాసుల నిర్వహణకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయా రాష్ట్రాలు 9,10, ఆపైన తరగతుల ప్రత్యేక్ష బోధనకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటించాయి. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ సైతం 2021 పరీక్షల తేదీలను ప్రకటించింది. సిలబస్‌ సరిగా పూర్తి కాకపోవడం, ఆన్‌లైన్‌ క్లాసులు అస్తవ్యస్తంగా సాగడంతో.. పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ బోర్డు సిలబస్ కొంతమేర తగ్గిస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చింది. అయితే ఇంకా సిలబస్‌ను (CBSE Board Syllabus) తగ్గిస్తారని.. దీనికి సంబంధించి బోర్డు ఉత్తర్వులిచ్చే అవకాశముందంటూ అపోహాలు మొదలయ్యాయి. దీంతో బోర్డు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సిలబస్‌పై వస్తున్న ఊహగానాలకు చెక్ పెడుతూ.. సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది.

సీబీఎస్ఈ క్లారిటీ.. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్వహించే 10వ తరగతి సోషల్ సైన్స్‌ (Social Science) సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌ తగ్గింపులో ఎటువంటి మార్పు లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. బోర్డు సిలబస్‌ తగ్గింపు విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయం తప్పితే.. కొత్తగా మరే నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టంచేసింది. గతేడాది జులైలో కరోనా విజృంభణ, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీబీఎస్‌ఈ 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల అన్ని సజ్జెక్టుల సిలబస్‌ను 30 శాతం మేర తగ్గిస్తున్నట్లు గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పరీక్షల తేదీలను సైతం వెల్లడించారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ సైతం తగ్గించిన సిలబస్‌ ఆధారంగా విద్యార్థుల పాఠ్య ప్రణాళికను రూపొందించి, నమూనా ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచారు.

సీబీఎస్‌ఈ (CBSE 10th Exams) 10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాల్లో అబ్జెక్టివ్‌ రూపంలో నిర్వహించే సోషల్‌ సైన్స్‌ పరీక్ష వచ్చే నెల మార్చి 27న జరగనుంది. ఈ సబ్జెక్టులో సిలబస్‌ను తగ్గిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం స్పందించిన సీబీఎస్.. బోర్డు సిలబస్‌ తగ్గింపు విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది. పాత నిర్ణయానికి అనుగుణంగానే పరీక్షల నిర్వహణ జరుతుందని విద్యార్థులు ఎలాంటి అపోహాలను నమ్మవద్దంటూ స్పష్టంచేసింది. అయితే ఏటా సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సుమారు 18 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుంటారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి ప్రధాన పరీక్షలు మే 4 నుంచి జూన్‌ 7 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో సిలబస్‌పై తలెత్తిన ప్రశ్నలపై క్లారిటీ ఇవ్వడంతో విద్యార్థులు పరీక్షలపై (CBSE Exams) దృష్టిసారించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Apsarkonda Water falls : కర్ణాటక దేవతల సరస్సు.. ఇందులో అప్సరసలు రోజూ స్నానం చేస్తారట..

Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu