ESIC Recruitment: హైదరాబాద్ ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు...
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు పోస్టులు ఉన్నాయి.
* ఫ్యాకల్టీ/సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 నుంచి 67 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్, హైదరాబాద్ అడ్రస్‌లో నిర్వహించనున్నారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 నుంచి రూ. 2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..