CSIR UGC NET June 2021 Exams: సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ జూన్ 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR - NET) అడ్మిట్ కార్డులను ఈరోజు (జనవరి 27, 2022)న విడుదల చేసింది.
CSIR UGC NET June 2021 admit card Released: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీఎస్‌ఐఆర్ – నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR – NET) అడ్మిట్ కార్డులను ఈరోజు (జనవరి 27, 2022)న విడుదల చేసింది. అభ్యర్ధులు CSIR UGC NET- 2021 అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా CSIR UGC NET పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జనవరి 29, ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో జరగనున్నాయి.
CSIR UGC NET పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండవ షిఫ్ట్‌లో పరీక్షలు CBT మోడ్‌లో జరుగుతాయి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లకు అభ్యర్ధులు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.
CSIR NET 2021 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్పులను అనుసరించండి..
- అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in.ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో ఉండే జాయింట్ CSIR UGC NET జూన్ 2021 డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ చేయడానికి మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయాలి.
- తర్వాత మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- డౌన్‌లోడ్ చేసి, ప్రింట్‌అవుట్ తీసుకోండి.
డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: