CPRI Recruitment: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
CPRI Recruitment: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CPRI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?
CPRI Recruitment: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CPRI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్), జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ/ఎంఫిల్, పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్/యూజీసీ నెట్ అర్హత ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-01-2022ని చివరి తేదీగా నిర్ణయిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Rajinikanth: నా అల్లుడు మంచివాడంటూ ధనుష్‌పై రజనీకాంత్ పొగడ్తల వర్షం.. వీడియో వైరల్..
Panic Attack: చలికాలం పానిక్ అటాక్ ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి..?