Rajinikanth: నా అల్లుడు మంచివాడంటూ ధనుష్‌పై రజనీకాంత్ పొగడ్తల వర్షం.. వీడియో వైరల్..

Rajinikanth Old Video: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) , ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) లు తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు చేసిన ప్రకటన సంచలనం..

Rajinikanth: నా అల్లుడు మంచివాడంటూ ధనుష్‌పై రజనీకాంత్ పొగడ్తల వర్షం.. వీడియో వైరల్..
Super Star Rajinikanth
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2022 | 3:32 PM

Rajinikanth Old Video: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) , ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) లు తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తాము విడిపోతున్నట్లు జనవరి 17, సోమవారం రాత్రి సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య , హీరో ధనుష్ లు 2004లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర ,లింగ అనే ఇద్దరు కుమారులు. 2006 యాత్ర , 2010లో లింగలు జన్మించారు. ఇప్పుడు రజనికాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ లు విడిపోయిన నేపథ్యంలో రజనీకాంత్.. ధనుష్‌ను ప్రశంసించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కాలా’ సినిమా మ్యూజిక్ లాంచ్‌ సమయంలో రజనీకాంత్ తన అల్లుడు ధనుష్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ధనుష్ “మంచి” తండ్రి , భర్త అని చెప్పిన వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది.

“ధనుష్ అద్భుతమైన అబ్బాయి. తన తల్లిదండ్రులను గౌరవిస్తాడు, వారిని దేవుడిగా భావిస్తాడు. భార్యను చూసుకుంటాడు. మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, మంచి ప్రతిభ గలవాడు” అని రజనీకాంత్ వీడియోలో పేర్కొన్నారు.

ధనుష్, 38, ఐశ్వర్య, 40, తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో విడిపోతున్నామని ప్రకటించారు. వీరిద్దరూ పద్దెనిమిదేళ్లపాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నారు. జీవిత ప్రయాణంలో ఎదుగుదలో ఒకరికొకరు తోడునీడగా కలిసి మెలసి అవగాహన, సర్దుబాటుతో జీవించామని ధనుష్ తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ రోజు మనం మన దారులు విడిపోయే ప్రదేశంలో నిలబడి ఉన్నాము. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము.. మా ప్రైవసీ మాకు ఇవ్వండి అంటూ ధనుష్ చెప్పారు.

“దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి.. మాకు అవసరమైన గోప్యతను మాకు అందించండి. ఓం నమశివాయ! స్ప్రెడ్ లవ్, డి,” అని ధనుష్ ట్విట్టర్‌లో ఒక నోట్‌ను ను షేర్ చేశారు. దీనినే ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. “ఏ క్యాప్షన్ అవసరం లేదు మీ అవగాహన .. మీ ప్రేమ అవసరం!”, అని ఓ క్యాప్షన్ ఇచ్చింది.

Also Read:

 ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లో ట్రై చేయండి.. ఒక్క సారి రుచి చూస్తే ఇక వదలరు..

 తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే.. కరోనా లక్షణాలు ఉన్నవారికి కిట్ ఇచ్చే ఏర్పాట్లు..