Drunken Drive: మద్యం మత్తులో సినీ హీరో ర్యాష్ డ్రైవింగ్.. కేసు నమోదు చేసిన బంజారహిల్స్ పోలీసులు..
Drunken Drive: పోలీసులు ఎన్ని రకాలుగా చెబుతోన్న మద్యం రాయుళ్లు మాత్రం మారడం లేదు. డ్రంకన్ డ్రైవ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో మద్యం మత్తులో వాహనాన్ని నడిపి..
Drunken Drive: పోలీసులు ఎన్ని రకాలుగా చెబుతోన్న మద్యం రాయుళ్లు మాత్రం మారడం లేదు. డ్రంకన్ డ్రైవ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో మద్యం మత్తులో వాహనాన్ని నడిపి బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే నటుడు దాసరి అరుణ్ కుమార్ బుధవారం రాత్రి హైదారాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మద్యం సేవించి కారు నడిపించారు.
ఈ క్రమంలోనే రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు బైక్‌లను ఢీకొట్టారు. దీంతో స్థానికులు బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరుణ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది.
దీంతో అరుణ్ కుమార్‌పై డ్రంకన్ డ్రైవర్ చట్టం 1988 ఐపీసీ సెక్షన్ 185, 304ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసుటు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే సినీ ప్రముఖుడు దివంగత దాసరి నారయాణ రావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అరుణ్ కుమార్.. గ్రీకు వీరుడు, ఆదివిష్ణు, చిన్నా వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
Also Read: UP Elections 2022: యూపీలో కాంగ్రెస్‌కు భారీ దెబ్బ.. పోస్టర్ గర్ల్ ప్రియాంక మోర్యా బీజేపీలోకి..
వామ్మో.. బామ్మ డాన్స్ మాములుగా లేదుగా !! రోడ్డుపైనే చిందులు !! వీడియో