ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(UP Elections) ముందే కాంగ్రెస్‌కు(Congress) గట్టి ఎదురుదెబ్బతగలనుంది. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైన తర్వాత వివాదం మొదలు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పార్టీని వీడిచిపెట్టి ఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇచ్చినట్లు ప్రకటించిన 24 గంటల్లోనే మరో నాయకురాలు పార్టీ వీడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.యూపీలో ‘నేను అమ్మాయిని, పోరాడగలను’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రియాంక మౌర్య ఇప్పుడు బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రియాంక మౌర్య బుధవారం బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడి బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లుగా సమాచారం.
నిజానికి యూపీలో కాంగ్రెస్ నేతలు చాలా మంది పార్టీని వీడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ‘గర్ల్ హూన్, ఫైట్ హూన్’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మౌర్య భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది.
ప్రియాంక మౌర్య ఇటీవలే సంచలన ఆరోపణ చేశారు. ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి సందీప్ సింగ్ డబ్బు తీసుకొని పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుంచి ప్రియాంక టికెట్ అడుగుతున్నారు. తనకు కాకుండా డబ్బులు ఇచ్చినవారికి మాత్రమే టికెట్లు దొరుకుతున్నాయని ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ అధిష్టానంపైనా అసంతృప్తితో ఉన్నారు ప్రియాంక మౌర్య.
బీజేపీ నాయకులతో కలిసి.. చర్చలు జరిపిన అంనంతరం ప్రియాంక మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో తాను కష్టపడి పనిచేశానన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. కానీ మా హక్కుల సంగతి వచ్చేసరికి మమ్మల్ని పక్కన పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రచారం కేవలం బూటకమని ప్రియాంక విమర్శించారు.
Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్ చాలా స్పెషాల్..