Chennai Metro Jobs: అనుభవం ఆధారంగా చెన్నై మెట్రోలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 1,90,000 వరకు జీతం..
Chennai Metro Jobs: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తోన్న మెట్రో రైల్ లిమిటెడ్‌లో...
Chennai Metro Jobs: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తోన్న మెట్రో రైల్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అనుభవం ఆధారంగా తీసుకోనున్న ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతాన్ని అందించనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హత..
* నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యుటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్(సివిల్), గ్రాడ్యుయేషన్(లా), ఎంఈ/ ఎంటెక్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
* విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 13 నుంచి 23 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును ఆధారంగా నెలకు రూ.90,000 నుంచి 1,90,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులు 40 నుంచి 50 ఏళ్లు మించకూడదు. ఇక ఈ పోస్టులను రెండేళ్ల కాల పరిమితితో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోనున్నారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలుకునే వారు senthil.s@cmrl.in మెయిల్‌కు పంపాలి. ఆఫ్‌లైన్ ద్వారా పంపించే వారు చెన్నై మెట్రో రైల్వే లిమిటెడ్ డిపార్ట్‌మెంట్‌కు వివరాలను పంపించాలి.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదిగా 04.06.2021ని నిర్ణయించారు.
Also Read: Apologies: అమానుషం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. దళితులను పంచాయతీ పెద్దల కాళ్ళు మొక్కించారు!