Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2024 Paper Leak Case: యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు ఎలాంటి ఆధారాల్లేవ్.. సీబీఐ

గత ఏడాది యుజీపీ-నెట్ పేపర్ అనుమానాస్పద లీక్‌పై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగించింది. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి కుట్ర జగరలేదని, దీనిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని సీబీఐ పేర్కొంది. ఇదంత ఓ విద్యార్థి డబ్బు సంపాదించడానికి యాప్‌ ద్వారా చేసిన మాయా జాలం అని అధికారులు మీడియాకు తెలిపారు..

UGC NET 2024 Paper Leak Case: యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు ఎలాంటి ఆధారాల్లేవ్.. సీబీఐ
UGC NET 2024 Paper Leak Case closed
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2025 | 10:02 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గతేడాది సంచలనం సృష్టించిన యూజీసీ -నెట్ (2024) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మూసివేస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యంకానందున కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నివేదికను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు నివేదించడంతో పాటు కేంద్ర విద్యా శాఖకు పంపించింది. అయితే ఈ కేసు మూసివేతకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాగా UGC-NET 2024 ప్రశ్నాపత్రం జూన్ 18న డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా పరీక్ష జరిగిన మరుసటి రోజే పరీక్ష రద్దు చేశారు. దీనిపై సీబీఐ ఆ మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

జూన్ 18 పరీక్ష కోసం లీక్ అయిన ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్‌ను ఓ విద్యార్ధి డబ్బు కోసం సర్క్యులేట్ చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ అధికారులు వెల్లడించారు. రెండో షిఫ్ట్‌కి ముందు పరీక్ష రోజు మధ్యాహ్నం టెలిగ్రామ్ ఛానెల్‌లలో ఇది ప్రత్యక్షం అయింది. పేపర్‌ లీక్ అయిందని సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తిని విచారించగా ఈ విషయం వెల్లడైందని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి ముందు దానిని యాక్సెస్ చేసినట్లు చూపించడానికి ఓ యాప్‌ను క్రియేట్‌ చేసి, అందులో విద్యార్థి ఫొటో, పరీక్ష తేదీ, సమయ వంటి వివరాలు సృష్టించాడని, పరీక్ష సమయంలో ఏ అభ్యర్థికి లాభం చేకూర్చేలా ఈ లీకేజీ ఉపయోగపడలేదని, ఇందుకు ఎలాంటి ఆధారాలు మాకు లభించనందున, మేము ఈ కేసును మూసివేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీ గతంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు కేసు వివరాలను తెలియజేస్తూ ఓ వివరణాత్మక నివేదికను కూడా పంపింది.

యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ప్రాథమిక కీ విడుదల

కాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) సెషన్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ తాజాగా వెలువడింది. అభ్యంతరాలకు ఫిబ్రవరి 3 వరకు తెలుపవచ్చు. జనవరి 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో పరీక్షలు జరిగాయి. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం
'కెడీ' సెట్స్‌కి వెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్..
'కెడీ' సెట్స్‌కి వెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్..
ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాములుగా ఉండదు మరి.. ఏకంగా సలార్ ఫిట్‌ను..
ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాములుగా ఉండదు మరి.. ఏకంగా సలార్ ఫిట్‌ను..
కొత్త టియాగో లుక్ అదరహో.. 2025 మోడల్ ఈవీ విడుదల
కొత్త టియాగో లుక్ అదరహో.. 2025 మోడల్ ఈవీ విడుదల
పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? మధుమేహులకు!
పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? మధుమేహులకు!
ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే
ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే
బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??
బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??
విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా?
విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా?
పాక్ క్రికెటర్లను భయపెడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల పెట్టుబడులు!
పాక్ క్రికెటర్లను భయపెడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల పెట్టుబడులు!