AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ.కామ్‌ చదువుతున్నారా.. కెరీర్‌ గురించి కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

B.Com Students: ఫైనాన్స్ అనేది కేవలం డబ్బు లావాదేవీ మాత్రమే కాదు ఇది ఒక కళ. ఫైనాన్స్‌లో కెరియర్‌ని నిర్మించుకోవడం అంటే ప్రపంచ ఆ

బీ.కామ్‌ చదువుతున్నారా.. కెరీర్‌ గురించి కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?
Students
uppula Raju
|

Updated on: Feb 04, 2022 | 5:37 PM

Share

B.Com Students: ఫైనాన్స్ అనేది కేవలం డబ్బు లావాదేవీ మాత్రమే కాదు ఇది ఒక కళ. ఫైనాన్స్‌లో కెరియర్‌ని నిర్మించుకోవడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే సంఖ్యలు, చార్ట్‌లు, నమూనాలు , నియమాలను తెలుసుకోవడం. ఇందులో ఫండ్స్, క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంట్, బ్యాంకింగ్, లయబిలిటీస్, అసెట్స్‌ని మేనేజ్ చేయడం నేర్పుతారు. ఈ రంగంలో ఆకర్షణీయమైన ఉద్యోగాల లభ్యతతో పాటు అర్హత కలిగిన అభ్యర్థులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి.

ఎలా ప్రారంభించాలి?

B.Com విద్యార్థులు ఫైనాన్స్ రంగాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రంగంలో ఉద్యోగం పొందడానికి అభ్యర్థి ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెన్సీ చేసి ఉంటే కెరీర్ పరంగా మీరు ఫైనాన్స్‌లో MBA చేయడం మంచిది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న యువకులు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్, ఎకనామిక్స్ లేదా కామర్స్‌లో పీజీ చేసిన తర్వాత మెరుగైన ప్లేస్‌మెంట్లను పొందవచ్చు. స్టడీస్, ప్లేస్‌మెంట్‌ల గురించి మంచి రికార్డు ఉన్న ఇన్‌స్టిట్యూట్ నుంచి మీరు ఫైనాన్స్‌లో MBA చేయడం ముఖ్యం.

కోర్సు సమాచారం

ఈ రోజుల్లో మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫైనాన్స్‌లో చాలా స్పెషలైజేషన్లు ఉన్నాయి. యువతలో డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ఫైనాన్స్‌లో, డిప్లొమా, పిజి డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్ స్థాయికి సంబంధించిన అనేక కోర్సులు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి. ఫైనాన్స్‌కు సంబంధించిన కరస్పాండెన్స్ లేదా ఆన్‌లైన్ కోర్సు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా B.Comతో అనుభవం కలిగి ఉండాలి. ఉన్నత స్థాయి డిగ్రీ మీ పురోగతికి మార్గాన్ని సులభతరం చేస్తుందని గుర్తుంచుకోండి.

ఫైనాన్స్‌లో టాప్ కోర్సు

పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనాలిసిస్, బీఏ/ఎంఏ ఇన్ ఫైనాన్స్, బీఎస్సీ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్

ఉద్యోగ అవకాశాలు

ఫైనాన్స్‌లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ మేనేజర్‌గా, రిటైల్ రిలేషన్‌షిప్ ఆఫీసర్‌గా, మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌గా పని చేయవచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు సంబంధించిన కంపెనీల్లో రిలేషన్‌షిప్ మేనేజర్, అసోసియేట్ ఆడిటర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. KPO సెక్టార్‌లో డేటా అనలిస్ట్, మార్కెట్ రీసెర్చర్, క్లయింట్ డెవలప్‌మెంట్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్‌గా సేవలందించవచ్చు. ఈక్విటీ రీసెర్చ్ సంస్థలలో కూడా అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఫైనాన్షియల్ అడ్వైజర్స్, క్రెడిట్ అనలిస్ట్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్స్, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్స్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, స్టాక్ బ్రోకర్లకు డిమాండ్ ఉంటుంది.

జీతం ప్యాకేజీ

మొదట్లో కంపెనీలో చేరిన తర్వాత నెలకు 30 నుంచి 35 వేల రూపాయలు లభిస్తాయి. అనుభవంలో ఇది నెలకు 55-75 వేల రూపాయలకు పెరుగుతుంది. నెలకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న నిపుణులు ఈ రంగంలో చాలా మంది ఉన్నారు.

Alert: పేరు, పుట్టిన తేది, ఫోన్‌ నెంబర్లని పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారా.. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం జాగ్రత్త..?

IND vs WI: ప్రేక్షకులు లేకుండానే భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు.. కానీ వారికి మాత్రం అనుమతి..?

UGC Chairman: యూజీసీ చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. ఎవరో తెలుసా..?

Follow Us