Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGUKT Basar: బాసర ఆర్జీయూకేటీలో ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

RGUKT Basar Rcruitment: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జేయూకేటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను..

RGUKT Basar: బాసర ఆర్జీయూకేటీలో ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2022 | 6:01 PM

RGUKT Basar Rcruitment:రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జేయూకేటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటఫికేషన్‌లో భాగంగా మొత్తం 99 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టీచింగ్ స్టాఫ్‌ (69), నాన్‌ టీచింగ్ స్టాఫ్‌ (30) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గెస్ట్‌ ఫ్యాకల్టీ, గెస్ట్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, గెస్ట్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి.

* సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఈఈఈ, ఎంఎంఈ, ఈసీఈ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత పొంది ఉండాలి. ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలు తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లిస్తారు.

* ఇంటర్వ్యూలను ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ బిల్డింగ్‌, ఆర్‌జీయూకేటీ, బాసర, నిర్మల్‌ 504107 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* తెలుగు పోస్టులకు ఫిబ్రవరి 5, ఫిజిక్స్‌ 06, కెమిస్ట్రీ 08, మ్యాథమెటిక్స్‌ 09, ఇంగ్లిష్‌ 10 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Allu Arjun: అక్కడా తగ్గేది లే అంటోన్న బన్నీ.. కొత్త యాడ్‌లో సౌత్‌ సినిమాపై ఫన్నీ కామెంట్స్‌.

UP ELECTIONS 2022: యుపీ ఎన్నికల ముఖచిత్రం అంతా సామాజివర్గాల సమ్మేళనం.. కులాల ప్రాతిపదికనే పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు

Health Tips: ఈ ఆహారపు అలవాట్లతో కాలేయానికి ప్రమాదం.. అవేంటంటే?