ICAI CA Exam Dates: సీఏ ఫైనల్ పరీక్షల తేదీని ప్రకటించిన ఐసిఎఐ.. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచంటే..

ICAI CA Exam Dates: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) సిఎ ఫైనల్, ఇంటర్మీడియట్, పిక్యూసి పరీక్షల తేదీని ప్రకటించింది.

ICAI CA Exam Dates: సీఏ ఫైనల్ పరీక్షల తేదీని ప్రకటించిన ఐసిఎఐ.. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 26, 2021 | 5:47 PM

ICAI CA Exam Dates: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) సిఎ ఫైనల్, ఇంటర్మీడియట్, పిక్యూసి పరీక్షల తేదీని ప్రకటించింది. ఈ ప్రకటన మేరకు పరీక్షలు జూలై 5, 2021 నుండి ప్రారంభం కానున్నాయి. ఐసిఎఐ సిఎ ఫైనల్, సిఎ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్‌ల పాత, కొత్త కోర్సులో ఉన్న విద్యార్థులు జూలై 5 నుండి పరీక్షలు రాసేందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ (పిక్యూసీ) కోర్సులతో పాటు ఇన్యూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్(ఐఆర్ఎం), టెక్నికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్-అసెస్‌మెంట్ టెస్ట్(ఐఎన్‌టిటి-ఏటీ) పరీక్షలు కూడా జులై 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఐసీఏఐ ద్వారా విడుదల కావాల్సి ఉంది.

“చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ (ఐపిసి) (పాత పథకం కింద), ఇంటర్మీడియట్ (కొత్త పథకం కింద), ఫైనల్ (పాత & క్రొత్త పథకం కింద), పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులు అనగా ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఆర్ఎం) టెక్నికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్-అసెస్‌మెంట్ టెస్ట్(ఐఎన్‌టిటి-ఏటీ) – మే 2021 పరీక్ష కూడా జూలై 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి’’ అని ఐసీఏఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి కంప్లీట్ షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు.

కాగా, కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా ఐసీఏఐ ఇంతకుముందు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పరీక్షలు మే నెలలోనే జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఆ పరీక్షలను వాయిదా వేశారు. అయితే, తాజాగా వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్‌ను 25 రోజుల ముందు ప్రకటించనున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది.

Also read:

Disaster Management System: నాసాతో ఇస్రో జత.. వాతావరణ మార్పులపై ఏర్పాటు చేస్తున్న అబ్జర్వేటరీలో భారత సంస్థ కీలక పాత్ర!

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి