BSF Recruitment 2022: బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్‌లో 281 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి/ఐటీఐ అర్హతలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF)లో.. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
BSF Constable SI Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF)లో.. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 281
పోస్టుల వివరాలు:
- ఎస్సై (మాస్టర్): 8
- ఎస్సై (ఇంజిన్ డ్రైవర్): 6
- ఎస్సై (వర్క్‌షాప్): 2
- హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్): 52
- హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్): 64
- హెడ్ కానిస్టేబుల్ (వర్క్‌షాప్): 19
- CT (సిబ్బంది): 130
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:
- సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విభాగాలు: వెహికిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్. పే స్కేల్: నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- కానిస్టేబుల్ పోస్టులకు పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికిల్ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్ తదితర విభాగాలు. పే స్కేల్: నెలకు రూ.21,700 ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- గ్రూప్ ‘బీ’ పోస్టులకు: రూ.200
- గ్రూప్ ‘సీ’ పోస్టులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, ఇతర అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (జూన్ 24, 2022).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.